20 నవం, 2008

అట్రాసిటి చట్టం తో మేలు కంటే కీడే ఎక్కువ

షెడ్యూల్ కులాలు,తెగల ప్రజలు సమాజం లో గౌరవంగా బతక టానికి,అగ్రవర్ణాలు, ఇతరులనుంచి అవమానాలు ఎదురుకాకుండా చూడటానికి తీసుకు వచ్చిన చట్టమే ప్రివెన్షన్ ఆప్ అట్రాసిటిస్ యాక్ట్-1989.ఈ చట్టం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరటం పక్కనబెడితే , విచ్చల విడిగా దుర్వినియోగం అవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది.1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారత రాజ్యాంగం లో పొందుపర్చిన 366 అధికరణంలోని 24,25 క్లాజుల ఆధారంగా 11 సెప్టెంబర్ 1989 న ఈ చట్టం రూపొందింది. ఈచట్టంలోని సెక్షన్-3 ప్రకారం షెడ్యూల్ కులాలు,తెగల వారిని దూషించటం,సంఘ బహిష్కరణ ,లైంగిక వేదింపులు, చిన్నచూపు చూడటం,దాడులకు పాల్పడటం మొదలగు 14 రకాల నేరాలు ఈ చట్టం క్రిందకు వస్తాయి. నాన్ బెయిలబుల్ కేసు నమోదు తో పాటు ,నేరం రుజువైతే 6నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విదించే వీలుంది. రాజకీయ కారణాలతో గత పదేళ్ళుగా అకారణంగా ప్రత్యర్దులపై ఈ చట్టం క్రింధ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు అత్యదికం. పనిచేసి పెట్టడం లేదనే సాకుతో ప్రబుత్వోద్యోగులపై, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని జర్ణలిస్టులపై ఇటీవలి కాలంలో ఈ చట్టం కింద ఎక్కువగా కేసులు పెడుతున్నారు. ముందుగా బెయిల్ (యాంటీసీపేటర్) దొరికే పరిస్తితి లేకపోవటం వల్ల నిందితులకు రాజీ తప్ప మరో మార్గం లేదు. ఈ చట్టం వల్ల ఎంతో మంది ప్రబుత్వోద్యోగులు అరెస్టయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టం పేరు చెబితేనే జర్ణలిస్టులు, వ్యాపారులు హడలి పోతున్నారు. పరి శోదనాత్మక వార్తలు రాసే పరిస్తితి లేక పోవటంతో గిరిజనాబివృద్ది దెబ్బతింది. అప్పు తీసుకుని అడిగితే కులం పేరుతో తిట్టాడని కెసులు పెడుతుండతంతో వ్యాపారులు వీరికి అప్పు ఇవ్వటమే మానివేశారు. కొద్ది మంది చేష్టలవల్ల మొత్తం జాతి ఇబ్బందుల పాలయ్యే పరిస్తితి.బ్లాక్ మెయిల్ కోరకు పెట్టిన ఈ కేసులన్నీ న్యాయస్తానాల్లొ నిలబడలేకపోతున్నాయి.శిక్షకు ముందే నిందితుదు రిమాండ్ ఖైదీగా నెలరోజులపాటు జైల్లో ఉండే పరిస్తితి. వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు..ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయ సూత్రం.ఏ నేరం చేయని వ్యక్తిని , సంఘంలో పేరు ప్రఖ్యాతులున్నవారిని ఒక వ్యక్తి ఇచ్చిన పిర్యాదుతో జైల్లో తోస్తే ఆ తర్వాత సమాజంపై అతని ముద్ర నెగిటివ్ దోరణిలో ఉండదా? 20 యేళ్ళ క్రితం పరిస్తితులు నేడు లేవు. అంటరానితనం తగ్గింది.ఎస్సీ,ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. అలాంటప్పుదు చట్టాన్ని మార్పు చేయకుండా యదాతధంగా అమలు చేయటం ఓట్ల రాజకీయమే.అట్రాసిటి చట్టం కింద నమోదైన కేసులలో పోలీసుల విచారణ సరిగా ఉండటం లేదనే ఆరోపణ లున్నాయి. డీఎస్పీ స్తాయి అధికారి ఈ కేసులను విచారణ చేయాల్సి ఉంటుంది.పిర్యాదు లో ఇచ్చిన సాక్షులను విచారించి చేతులు దులుపు కుంటున్నారు.చాలావరకు బోగస్ కేసులే .తనపై కేసు నమోదు అయ్యిందని పోలీసులు చెప్పేవరకు నిందితుడికి తెలియదు.సంఘటన ఎప్పుడు,ఎక్కడ జరిగిందో కేసు ఎవరు పెట్టారోతెలియని బోగస్ కేసులే అధికం. నలుగురు సాక్షులుంటే చాలు ఏ స్తాయి వారి మీదనైన కేసు పెట్టవచ్చు.హత్య కేసులో కూడా అడ్వాన్సుగా బెయిల్ పొంది సమాజంలో గౌరవంగా తిరుగుతుంటే ,ఎస్సీ,ఎస్టి యాక్టు కేసుల్లో జైలు గదప తొక్కనిదే బయటపడలేని పరిస్తితి. వ్యక్తి స్వేచ్చకు,పత్రికా స్వేచ్చకు,సమాజంలో జీవించే స్వేచ్చకు ఇబ్బందికరంగా తయారైన ఈ చట్టాన్ని సవరించి మార్పులు తీసుకురావాలి.

7 కామెంట్‌లు:

  1. ఈ చట్టం బాధలు జర్నలిస్ట్ లకు, కూడా ఉన్నయ్యా?. నిజమే మంచి చేద్దామని పెట్టిన చట్టం, కొంత మంది చేసే దుర్వినియోగం వలన, ఉపయోగపడక పోగా, ఎవరికి అయితే ఉపయోగపడాలో వాళ్లకే చేటు తెస్తుంది.
    నా పరిధిలో నేను చూసిన, రెండు సంఘటనలు చేబ్తాను.
    1. ఓ z.p. school ల్లో, ఓ Teacher టైం కు రాకపోవటం, వచ్చినా పాఠాలు చెప్పకపోవటం, పిల్లలను వ్యక్తిగత పనులకు ఉపయోగించుకోవటం చేస్తుంటే, అక్కడ Head Master మందలిస్తే జరిగింది ఎమిటో తెలుసా, అతను వెళ్లి ఆ Head Master మీద ఈ చట్టం క్రింద కులం తో దూషించాడు అని కేసు పెట్టడం. దురద్రుస్ఠకరం ఏమిటి అంటే, ఆ స్చూల్ లో, ఎక్కువమంది దళిత విధ్యార్దులే. ఆ Head Master ఆ కేసు నుండి బయట పడెటప్పటికి, తల ప్రాణం తోకకు వచ్చింది అని వేరే చెప్పక్కర్లేదనుకొంటాను. చివరకు నష్టపోయింది దళిత వి
    2. నాకు తెలిసిన వాళ్లు వ్యవసాయం చేయడం మానివేయటం వలన వాళ్ల పోలాలను కౌలుకు దాదాపు 30, 40 సంవస్తరాలుగా ఇస్తున్నరు. ఇన్ని సంవస్తరాలుగా ఇస్తున్న వీరయ్యకు ఇవ్వటం మానివేస్తే, నేను మొన్న ఇండియా వెళ్లినప్పుడు, వీరయ్య వచ్చి మీరైనా చెప్పండి, ఇన్ని సంవస్తరాలుగా నమ్మకంగా కౌలు ఇస్తున్నాను, వాళ్ల ఇంట్లొ మనిషి నే నేను కూడ, ఇప్పుడు వాళ్లు కౌలు కు నాకు ఇవ్వకపోతే, ఊళ్లొ నా పరువు ఏమవుతుంది, కౌలు ఎగగొడితే నాకు ఇవ్వలేదనుకోంటున్నరు అందరూ అని చెప్పుకొచ్చాడు.
    సరే, ఇద్దరూ కావల్సిన వాళ్లె కాబట్టి, వాళ్లు కలసినప్పుడు, ఇదే మాట అడిగితే, వాళ్లు అన్నది ఒకటే, వీరయ్య మంచివాడె, ఇన్ని సంవస్తరాలు మా ఇంట్లొ ఒకడు గానే మెలిగాడు. కాకపోతే ఇప్పుడు తన పిల్లల హయం వచ్చింది, వాళ్లు దళితులు కాబట్టి, రేపొద్దున ఎమైనా తేడాలు వస్తే, ఈ చట్టం క్రింద ఓ కేసు వేస్తే మా పరిస్థి ఏమిటి? ఆ వచ్చే కౌలు కోసం, ఆ రిస్క్ తీసుకోవటం అవసరమా అంటూ, అలా ఆ ఉర్లోనే పెట్టిన కేసు గురించి చెబ్తే, ఎమనాలో అర్ధం కాలేదు.

    ఇప్పుడు ఈ చట్టానికి, మిగతా కులాల వాళ్లు ఎంత బాధితులో (కనిపిస్తూ), కనిపించకుండా అంతకంటే, దళితులే ఎక్కువ బాధితులు అనిపిస్తుంది.

    కాకపోతే "పిల్లి మెడలో గంట కొట్టేది ఎవరు" అన్నట్లు, ఈ చట్టాన్ని సవరించాలి అనే ధైర్యం ఏ రాజకీయనాయకులకు లేదు. ఏమి చేస్తాం? వీలయినంతవరకూ జాగర్తగా ఉండటమే.

    రిప్లయితొలగించండి
  2. అవును, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులనే ఈ చట్టం కింద ఖైదు చేశారు. కార్యాలయాలలో కింద ఉద్యోగి S.C/S.T. అయితే, పై అధికారులు పని విషయం లో గట్టిగా అడగలేని పరిస్థితి. బ్లాక్ మెయిల్ వగైరా లాంటి పనులతో, ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది. కాలానుగుణ మార్పులు అభిలషణీయం.

    రిప్లయితొలగించండి
  3. ఏకీభవిస్తున్నాను. ఈ మధ్య మన రాష్ట్రం లో అది ఏ విధంగా దుర్వినియోగం అయిందో తెలిసిందే కదా.

    రిప్లయితొలగించండి
  4. ఏ మనిషి ఏ మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించినా శిక్షించాల్సిందే. అటువంటప్పుడు కేవలం SC, STల కోసం మాత్రమే అత్యాచార నిరోధక చట్టం అవసరమా ? పౌరులందఱికీ కలిపి ఒక అత్యాచార నిరోధక చట్టం సరిపోదా ? ఒక ప్రత్యేక వర్గం పట్ల ప్రభుత్వం తన నిబద్ధతని చాటుకునే పని ఉందా ? ఒక అమానుషాన్ని నిరోధించడం కోసం ఇంకో అమానుష చట్టం చెయ్యడం వివేకవంతమేనా ? వోట్ బ్యాంకుల కోసం కాకపోతే ఎందుకు చేసినట్లో ఇలాంటి చట్టాలు ? ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే - తమక్కూడా ఒక అత్యాచార నిరోధక చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నారు మైనారిటీలూ, బీసీలూ ! ఈ మధ్య ఒక ఎఫ్.సి. సంఘం కూడా ఇలాంటి డిమాండుతో ముందుకొచ్చింది.

    రిప్లయితొలగించండి
  5. ఆలోచించాల్సిన విషయం ఇది. కాని దీన్ని సవరించాలి అంటే కుదురుతుందా ?

    రిప్లయితొలగించండి
  6. Written something about same thing here.
    http://ravindranadhg.blogspot.com/2008_06_01_archive.html

    రిప్లయితొలగించండి