26 జులై, 2009

లోక్ సత్తా బిల్లుకు మద్దతు తెలపండిఅవినీతిపై ' ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్ మెంట్ యాక్ట్-2009 ' ముసాయిదా బిల్లును లోక్ సత్తా రూపొందించింది. ఈ బిల్లును చట్ట రూపంలో తీసుకురావటానికి వీలుగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టటానికి ప్రజల తరపున ప్రబుత్వంపై ఒత్తిడి తీసుకు రావటానికి ప్రయత్నాలు ప్రారంబించింది. బిల్లు ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుగా రాష్త్ర ప్రజానీకం తరపున ముఖ్యమంత్రికి పిటిషన్ సమర్పించాలని నిర్ణయించారు.
ఈమేరకు యాక్టు, పిటిషన్ ను నెట్ లో ఉంచి సంతకాల సేకరణ చేపట్టారు. స్పీకర్, మండలి చైర్మన్, ప్రతిపక్ష నేత, అన్ని పార్టీల అద్యక్షులు, ప్లోర్ లీడర్లు, న్యాయ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రుల కు ఈ డాక్యుమెంట్ లను అందజేయ నున్నారు.

అమెండ్ మెంట్ యాక్టు డ్రాప్టు ను బొలిశెట్టి కపిలేశ్వర్ రూపొందించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రస్తుతమున్న చట్టం ద్వారా సాద్యపడదని కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇందులో సూచించారు.

అమెండ్ మెంట్ లో కొన్ని ముఖ్యమైన సూచనలు:-
*ప్రబుత్వ అధికారులు అవినీతికి పాల్పడినపుడు వారి ఆస్థుల జప్తు,సస్పెన్షన్ లో నిఘా అధికారులకు నిబందనలను సులభతరం చేయడం.
*ప్రతి జిల్లాలో ప్రత్యేక అవినీతి నిరోధక కోర్టుల ఏర్పాటు.
*లోకాయుక్థ పరిధిలో స్వయంప్రతిపత్తి కల్గిన అవినీతి నిరోధక సంస్థ ఏర్పాటు.
*అక్రమ ఆస్థులు కల్గి, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి నేరం ఒప్పుకున్న వారిని నేరస్తులుగా పరిగణించాలి.


అవినీతి రహిత సమాజాన్ని కాంక్షించే వారు ఈ పిటిషన్ కు మీ మద్దతు తెలపండి. మీపేరు, ఈ-మెయిల్, బిల్లుపై మీ ఆమోదం తెలియజేస్తూ సంతకం చేయండి. మీ మిత్రులకు తెలియ జేయండి.
లోక్ సత్తా సూచిస్తున్న ముసాయిదా డాక్యుమెంట్ ను ఇక్కడ చూడండి.

13 డిసెం, 2008

నేరము-శిక్ష

ఒక ఆటవిక సంస్కృతికి - ఒక ఆటవిక న్యాయం తోనే వరంగల్ పోలీసులు సమాధానం చెప్పారు. యాసిడ్ దాడి నిందితుల ఎన్ కౌంటర్ ఎలుకలు దూరాయని చూరుకు నిప్పంటించుకోవటమే . ఈ ఎన్ కౌంటర్ సామాన్యుడికి చట్టాలపై గౌరవం, నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. పోలీసులు, ప్రబుత్వమే చట్టాలను ఉల్లంఘించి హత్యలకు పాల్పడటం ఏ నాగరిక సమాజం సహించదు. ఇంజనీరింగ్ విద్యార్ధినులు స్వప్నిక, ప్రణీత పై యాసిడ్ దాడిని సబ్యసమాజం ముక్తఖంఠం తో ఖండించింది. నిందితులకు మరణశిక్ష పడాలని కోరు కునేవాడిలో నేను ఒకడిని. (అమలు రాష్ట్రపతి నిర్ణయం). ప్రజలు కోరు కుంటున్నారని నిందితులను ఈ రకంగా హత్యచేయటం చట్టం తన పరిది దాటి పని చేయటమే. ఈ ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు ప్రజలకు ఏం చెప్ప దల్చు కున్నారు. మున్ముందు ఎవరు ఇలా చేయరనా.. అలాగైతే ఉరిశిక్ష తర్వాత ఇలాంటి సంఘటనలు జరగకూడదు గదా .. అప్పుడే వరంగల్ లో మరో సంఘటణ జరిగింది..అతడిని కూడా చంపుతారా.. ప్రత్యూష, అయేష మీరా కేసులలో రాజకీయ నాయకుల వారసులను ఎందుకు చంపలేదు..నాయకులు డబ్బున్నవారు ఏం చేసిన చెల్లుభాటు అవుతుంధా ? వరంగల్ పోలీసులకు ఇది కొత్త కాదు. మనీషా నిందితులను ఇలానే చేశారు. తప్పు చేసిన పోలీసులను హీరోలుగా చూస్తున్నారు.ప్రజలు ఇలా ప్రోత్సహిస్తే వారు ఇలాంటి ఎన్ కౌంటర్ లు ఎన్నైనా చేయగలరు. పోలీసులే శిక్షలు అమలు చేస్తే ఇక న్యాయస్థానాలు, ప్రబుత్వాలు, జైళ్ళు ఎందుకు.. అరభ్ దేశాల మాదిరిగా శిక్షకు శిక్ష కావాలని ప్రజలు కోరుకుంటే ప్రబుత్వం ప్రజాస్వామ్యానికి పాతర వేసి ఆ విధమైన చట్టాలు అమలు చేయ వచ్చుగా.. ఈ రోజు ఈ ఘటనను సమర్దిస్తే ..దీనిని సాకుగా తీసుకుని పోలీసులురేపు అమాయకులను చంపితే ఎవరు భాద్యత వహిస్తారు.. పోలీసులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల ఆవేశాన్ని చల్లార్చడానికి ,ఎన్నికల ముందు ప్రబుత్వం ఈ న్యూసెన్స్ బరించలేకే ఈ దురాఘతానికి ఒడిఘట్టాయి. చత్త బద్దంగా చేయాల్సిన పనిని ఆటవికంగా చేశారు. అర్ధరాత్రి దొడ్డి దారి లో చంపకుండా పబ్లిక్ లో వాళ్ళను శిక్షిస్తే పోలీస్ శాఖ విశ్వసనీయత పెరిగేది. వరసగా సంఘటణలు జరగటం, నిందితులకు శిక్షల ఖరారులో విపరీత జాప్యం జరిగి నేరస్తులు తప్పించుకోవటం ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది. ఆత్యా చారాలు, ర్యాగింగ్, మహిళ పై దాడులు వంటి కేసుల్లో కటిన శిక్షలు లేకపోవటం ,ప్రాసికౄషన్ బలంగా ఉండక పోవటం, , పోలీసు శాఖ పని తీరు సరిగా లేకపోవటం నిందితులు తప్పించుకోవటానికి కారణాలు. పోలీసుల నిర్వాకం వల్ల ఐ దు కుటుంభాలకు తీరని శోకం మిగిలింది. మిత్రునికి సహకరించిన ఇద్ద్దరు యువకులు బలయ్యారు. మానవ సంబంధాలు, యువత పెడదోరణులు ,వేష ధారణ పై చర్చ జరగాలి. వ్యవస్తలో వస్తున్న మార్పులకు అబ్బాయిలే కాదు అమ్మాయిలకు బాద్యత ఉంది. హోం మినిష్టర్ గారూ.. చట్టం తనపని తాను చేసుకు పోవటమే కాదు .. న్యాయం పనికూడా చేస్తుందిసార్..

20 నవం, 2008

అట్రాసిటి చట్టం తో మేలు కంటే కీడే ఎక్కువ

షెడ్యూల్ కులాలు,తెగల ప్రజలు సమాజం లో గౌరవంగా బతక టానికి,అగ్రవర్ణాలు, ఇతరులనుంచి అవమానాలు ఎదురుకాకుండా చూడటానికి తీసుకు వచ్చిన చట్టమే ప్రివెన్షన్ ఆప్ అట్రాసిటిస్ యాక్ట్-1989.ఈ చట్టం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరటం పక్కనబెడితే , విచ్చల విడిగా దుర్వినియోగం అవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది.1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారత రాజ్యాంగం లో పొందుపర్చిన 366 అధికరణంలోని 24,25 క్లాజుల ఆధారంగా 11 సెప్టెంబర్ 1989 న ఈ చట్టం రూపొందింది. ఈచట్టంలోని సెక్షన్-3 ప్రకారం షెడ్యూల్ కులాలు,తెగల వారిని దూషించటం,సంఘ బహిష్కరణ ,లైంగిక వేదింపులు, చిన్నచూపు చూడటం,దాడులకు పాల్పడటం మొదలగు 14 రకాల నేరాలు ఈ చట్టం క్రిందకు వస్తాయి. నాన్ బెయిలబుల్ కేసు నమోదు తో పాటు ,నేరం రుజువైతే 6నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విదించే వీలుంది. రాజకీయ కారణాలతో గత పదేళ్ళుగా అకారణంగా ప్రత్యర్దులపై ఈ చట్టం క్రింధ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు అత్యదికం. పనిచేసి పెట్టడం లేదనే సాకుతో ప్రబుత్వోద్యోగులపై, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని జర్ణలిస్టులపై ఇటీవలి కాలంలో ఈ చట్టం కింద ఎక్కువగా కేసులు పెడుతున్నారు. ముందుగా బెయిల్ (యాంటీసీపేటర్) దొరికే పరిస్తితి లేకపోవటం వల్ల నిందితులకు రాజీ తప్ప మరో మార్గం లేదు. ఈ చట్టం వల్ల ఎంతో మంది ప్రబుత్వోద్యోగులు అరెస్టయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టం పేరు చెబితేనే జర్ణలిస్టులు, వ్యాపారులు హడలి పోతున్నారు. పరి శోదనాత్మక వార్తలు రాసే పరిస్తితి లేక పోవటంతో గిరిజనాబివృద్ది దెబ్బతింది. అప్పు తీసుకుని అడిగితే కులం పేరుతో తిట్టాడని కెసులు పెడుతుండతంతో వ్యాపారులు వీరికి అప్పు ఇవ్వటమే మానివేశారు. కొద్ది మంది చేష్టలవల్ల మొత్తం జాతి ఇబ్బందుల పాలయ్యే పరిస్తితి.బ్లాక్ మెయిల్ కోరకు పెట్టిన ఈ కేసులన్నీ న్యాయస్తానాల్లొ నిలబడలేకపోతున్నాయి.శిక్షకు ముందే నిందితుదు రిమాండ్ ఖైదీగా నెలరోజులపాటు జైల్లో ఉండే పరిస్తితి. వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు..ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయ సూత్రం.ఏ నేరం చేయని వ్యక్తిని , సంఘంలో పేరు ప్రఖ్యాతులున్నవారిని ఒక వ్యక్తి ఇచ్చిన పిర్యాదుతో జైల్లో తోస్తే ఆ తర్వాత సమాజంపై అతని ముద్ర నెగిటివ్ దోరణిలో ఉండదా? 20 యేళ్ళ క్రితం పరిస్తితులు నేడు లేవు. అంటరానితనం తగ్గింది.ఎస్సీ,ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. అలాంటప్పుదు చట్టాన్ని మార్పు చేయకుండా యదాతధంగా అమలు చేయటం ఓట్ల రాజకీయమే.అట్రాసిటి చట్టం కింద నమోదైన కేసులలో పోలీసుల విచారణ సరిగా ఉండటం లేదనే ఆరోపణ లున్నాయి. డీఎస్పీ స్తాయి అధికారి ఈ కేసులను విచారణ చేయాల్సి ఉంటుంది.పిర్యాదు లో ఇచ్చిన సాక్షులను విచారించి చేతులు దులుపు కుంటున్నారు.చాలావరకు బోగస్ కేసులే .తనపై కేసు నమోదు అయ్యిందని పోలీసులు చెప్పేవరకు నిందితుడికి తెలియదు.సంఘటన ఎప్పుడు,ఎక్కడ జరిగిందో కేసు ఎవరు పెట్టారోతెలియని బోగస్ కేసులే అధికం. నలుగురు సాక్షులుంటే చాలు ఏ స్తాయి వారి మీదనైన కేసు పెట్టవచ్చు.హత్య కేసులో కూడా అడ్వాన్సుగా బెయిల్ పొంది సమాజంలో గౌరవంగా తిరుగుతుంటే ,ఎస్సీ,ఎస్టి యాక్టు కేసుల్లో జైలు గదప తొక్కనిదే బయటపడలేని పరిస్తితి. వ్యక్తి స్వేచ్చకు,పత్రికా స్వేచ్చకు,సమాజంలో జీవించే స్వేచ్చకు ఇబ్బందికరంగా తయారైన ఈ చట్టాన్ని సవరించి మార్పులు తీసుకురావాలి.

17 నవం, 2008

సమాచారం అడిగితే వేలు, లక్షలివ్వాలట

సమాచార హక్కు చట్టం క్రింద తమకు అవసరమైన సమాచారం పొంధటం పౌరుల హక్కు.ప్రజలడిగిన సమాచారం ఇవ్వకుండా అధికారులు వారిని హడలగొడుతున్నారు.తెలుగులో సాప్ట్ వేర్ లేధని, సిడి,డివిడి రూపంలో ఇవ్వలేమని, జిరాక్స్ ఖర్చుల క్రింద వేలు లక్షలు ఇవ్వాలని బెదరగొడుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగం (ఎస్.ఎల్.బి.సి) నిర్మాణంలో కాంట్రాక్టు పొందిన సంస్థ చేసిన పని కంటే అధిక బిల్లు పొందిందని,వాటి వివరాల కొరకు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సే రేవంత్ రెడ్డి దరఖాస్తు చేస్తే సంబందిత పత్రాలు ఇవ్వటానికి నీటిపారుదల శాఖ అధికారులు 14 వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. చేసేదేమీ లేక ఆయన ఆమొత్తం చెల్లించి వివరాలు పొందారు.ఒక ఎమ్మెల్సీ కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల స్థితి ఏమిటి? వేల రూపాయలు చెల్లించి వివరాలు పొందటం వారికి సాద్యమా? పౌర సరపరాల శాఖలో రేషన్ కార్డుల వివరాలు ఇవ్వటానికి కీ-రిజిస్టర్లు జిరాక్స్ కొరకు లక్షల రూపాయలు ఇస్తేనే వివరాలు పంపుతామని రెవిన్యూ అధికారులు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లా ఈనాడు సహ ప్రతినిది నర్సింహులుకు జిల్లాలో మొత్తం తెలుపు,అంత్యోదయ, అన్నపూర్ణ మొదలగు రేషన్ కార్డుల వివరాలు ఇవ్వటానికి రూ.1.20 లక్షలు ఖర్చవుతాయని తెలపటంతో అవాక్కయ్యాడు. ఇలాగే బీహార్ లోని భోజ్ పూర్ జిల్లా ఆగీయా కు చెందిన గుప్తేశ్వర్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆరు గ్రామాల్లో పి డి ఎస్ కింద పంపిణి చేసిన ఆహార ధాన్యాలు, కిరోసిన్ వివరాలు ఇవ్వాలని కోరగా, పత్రాల జిరాక్స్ ఖర్చుల కింద ఆయనను అడిగింది ఎంతో తెలుసా..అక్షరాలా రూ.78 లక్షలట.సహ చట్టం అమలు లోకి వచ్చి మూడేళ్ళయినా ప్రబుత్వ కార్యాలయాల్లో కంప్యూటరీకరణ జరగకపోవటం, తెలుగు భాషను సమర్దంగా అమలు చేయక పోవటం, అధికారుల నిర్లక్ష్యం వల్ల మున్ముందు ఎవరు దరఖాస్తు ఇచ్చే సాహసం చేయకపోవచ్చు.

24 సెప్టెం, 2008

అవినీతిలో భారత్ 85 వ స్థానం

భారత్ లో అవినీతి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా "ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్" దాని అను బంధ సంస్థలు 180 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ప్రపంచ అవినీతి దేశాల జాబితాలో 85 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 72వ స్థానంలో ఉండేది. 3.4 మార్కులతో భారత్ 85 వ స్థానంలో నిలవగా, 2.5 మార్కులతో పాకిస్థాన్ 134 వ స్థానంలో ఉంది. చైనా 72వ స్థానంలో నిలిచింది. 9.3 మార్కులతో డెన్మార్క్ అతి తక్కువ అవినీతి గల దేశంగా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో న్యూజీలాండ్ , స్వీడన్ , సింగపూర్ లు ఉన్నాయి. అత్యధిక అవినీతి ఉన్న జాబితాలో హైతీ, ఇరాక్ , మయన్మార్ , సోమాలియా తదితర దేశాలు ఉన్నాయి. వీటికి 1.5 కంటే తక్కువ మార్కులు వచ్చాయి. (ఈనాడు సౌజన్యంతో)

9 సెప్టెం, 2008

గృహ నిర్మాణం లో అక్రమ వసూళ్ళపై సి.ఆర్.ఎస్ విధానం ద్వారా పిర్యాదు

గృహ నిర్మాణ శాఖ లో లబ్ది దారుల నుంచి వచ్చే పిర్యాదు లను సి.ఆర్.ఎస్ (కంప్లయింట్ రెడెస్సల్ సిస్టం )విదానాన్ని అమలు చేస్తున్నారు.పిర్యాదు లో పారదర్శకత ఉండటానికి ఈవిదానాన్ని అవలంబిస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించుకుంది.గృహనిర్మాణం లో మెటీరియల్ కొరత, లబ్ది దారుల జాబితా నుంచి అర్హుల తొలగింపు, బిల్లుల చెల్లింపు లో ఆలస్యం,అక్రమ వసూళ్ళు,నిర్మాణ లోపాలు తధితర విషయాలపై ఉచిత "టోల్ ప్రీ నెం" 1100 కు పోన్ చేసి పిర్యాదు చేయవచ్చు.మీ పేరు, పోన్ నెంబరు,విషయం,పిర్యాదు, ఎవరిపై పిర్యాదు చేస్తున్నారో వారి వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది. మీ పిర్యాదును నమోదు చేసే ఆపరేటర్ మీకోక డాకెట్ నెంబరు కేటాయిస్తారు.మీ పిర్యాదును ఇందిరమ్మ.డాట్ కాం వెభ్ సైట్ లో చూడవచ్చు. ఎస్.ఎం.ఎస్ విధానం ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాటైన "కాల్ సెంటర్లు" కు సందేశాన్ని పంపి పిర్యాదును పరిష్క రిస్తారు.ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా 1676 పిర్యాదులు అందగా,వీటిలో 549 పిర్యాదులను తిరస్కరించారు.153 ఫెండింగులో ఉంచారు. మిగిలిన 974 పిర్యాదులను వెబ్ సైట్లో పరిష్కారం కొరకు ఉంచారు.ఇంకా పరిపాలనా పరమైన విషయాలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలియ జేయ వచ్చు. 1) ఆర్.సుబ్రమన్యం,ఐ.ఎ.ఎస్,ఎం డి ,గృహ నిర్మాణ శాఖ, పోన్: 040-23228930 2) కె.రాంగోపాల్,ఐ.ఎ., ఇడి ,గృహ నిర్మాణ శాఖ, పోన్:040_232228930

ఐడి ఉపయోగించడం ద్వారా ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో అక్రమాలకు "చెక్"


ఇందిరమ్మ పథకం క్రింద మంజూరు చేస్తోన్న ఇళ్ళలో అక్రమాలు జరగకుండా చూసుకునే అవకాశం ఇప్పుడు లబ్దిదారులకు లభించింది.ఈ పథకం పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో గృహ నిర్మాణ శాఖ లబ్ది దారుల జాబితా తో పాటు పూర్తి వివరాలను ఆన్ లైన్ లో ఉంచింది.ఇందిరమ్మ పేరిట వెబ్ సైట్ ను ఓపెన్ చెసి మొదటి రెండు విడతలకు సంబందించిన సమాచారాన్ని ఇందులో పొందుపర్చింది.లబ్దిదారు పేరు,ఐడి నెం,పథకంపేరు, ఇంటి నిర్మాన దశ, సిమెంట్, నగదు చెల్లింపు వివరాలు ఉన్నాయి. మూడవ విడత వివరాలు నమోదు చేసే పక్రియ కూడా మొదలైంది. ఇందిరమ్మ పథకంలో లబ్ది దారుల ఎంపిక పక్రియ మొదలు చివరివరకు రాజకీయ జోక్యం,అదికారుల అవినీతి వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరలేదు.ప్రబుత్వం లక్షల్లో ఇళ్ళిచ్చామని చెబుతున్నా,అదే సంఖ్యలో ఇంకా పేదలు గూడు కోసం నిరీక్షిస్తుండటం ఈ పథక వైపల్యాలను చెప్పకనే చెబుతుంది. అనర్హులే ఒక్కొక్కరు రెండేసి,మూడేసి ఇళ్ళను మంజూరు చేయించుకొని భవంతులు కట్టడం మన కళ్ళ ముందే కనిపిస్తంది.గతంలో మంజూరైన వారికే మళ్ళీ బినామీ పేర్లతో మంజూరు,ఊర్లో లేని వారికి ఇండ్లు,పాత ఇండ్లకే మెరుగులు ఇదీ గ్రామాల్లో పలుకుబడి కల్గిన వారి పరిస్తితి.ఇక పేదలకు ఇళ్ళు మంజూరైనా ఎంత వస్తుందో, ఎంత ఇస్తారో వర్క్ ఇన్స్ పెక్టర్ల ధయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది.బ్యాంకు పత్రాలపై ముందే సంతకం తీసుకుని నగదు వారే మినహాయించుకొని ఇస్తారు.లక్ష వ్యయం చేస్తే కానీ పూర్తి కాని ఇల్లుకు ప్రబుత్వమిచ్చే ముప్పై వేల సాయం ఏ మూలకు సరి పోక బలహీన వర్గాలు మద్యలో నిర్మాణం ఆపేస్తే , పూర్తయినట్లుగా చూపి ఆ సొమ్ము కాజేస్తున్నారు. ఇకనైనా మేల్కోండి..అక్రమాలను అడ్డుకోండి..గృహం మంజూరు వెంట ఇచ్చిన ఐడి కార్డు నెంబరును ఇందిరమ్మ వెబ్ సైట్లో నమోదు (ఎంటర్) చేసి క్లిక్ చేస్తే మీ ఇంటికి సంబందించిన వివరాలు,సిమెంట్, నగదు చెల్లింపు వివరాలు తెలుస్తాయి.లేదా జిల్లా,మండలం,గ్రామమం ఎంపికచేసి మీ గ్రామాంలో ఇళ్ళు మంజూరైన వారి పూర్తి జాబితా పొందవచ్చు.వీరిలో ఎవరు అర్హులో, ఎవరు అన ర్హులో తెలుకోవటం ఇట్టే తెలిసి పోతుంది.ఇక్కడ ఇచ్చిన పోటోలలో స్కీం కు సంబందించిన వివరాలను ఇచ్చాం.వాటిని బేరీజు వేసుకోండి. (ఇందిరమ్మ అక్రమాలపై పిర్యాదు చేయట మెలాగో మరో వార్త లో తెలుసుకుందాము)