17 నవం, 2008

సమాచారం అడిగితే వేలు, లక్షలివ్వాలట

సమాచార హక్కు చట్టం క్రింద తమకు అవసరమైన సమాచారం పొంధటం పౌరుల హక్కు.ప్రజలడిగిన సమాచారం ఇవ్వకుండా అధికారులు వారిని హడలగొడుతున్నారు.తెలుగులో సాప్ట్ వేర్ లేధని, సిడి,డివిడి రూపంలో ఇవ్వలేమని, జిరాక్స్ ఖర్చుల క్రింద వేలు లక్షలు ఇవ్వాలని బెదరగొడుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగం (ఎస్.ఎల్.బి.సి) నిర్మాణంలో కాంట్రాక్టు పొందిన సంస్థ చేసిన పని కంటే అధిక బిల్లు పొందిందని,వాటి వివరాల కొరకు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సే రేవంత్ రెడ్డి దరఖాస్తు చేస్తే సంబందిత పత్రాలు ఇవ్వటానికి నీటిపారుదల శాఖ అధికారులు 14 వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. చేసేదేమీ లేక ఆయన ఆమొత్తం చెల్లించి వివరాలు పొందారు.ఒక ఎమ్మెల్సీ కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల స్థితి ఏమిటి? వేల రూపాయలు చెల్లించి వివరాలు పొందటం వారికి సాద్యమా? పౌర సరపరాల శాఖలో రేషన్ కార్డుల వివరాలు ఇవ్వటానికి కీ-రిజిస్టర్లు జిరాక్స్ కొరకు లక్షల రూపాయలు ఇస్తేనే వివరాలు పంపుతామని రెవిన్యూ అధికారులు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లా ఈనాడు సహ ప్రతినిది నర్సింహులుకు జిల్లాలో మొత్తం తెలుపు,అంత్యోదయ, అన్నపూర్ణ మొదలగు రేషన్ కార్డుల వివరాలు ఇవ్వటానికి రూ.1.20 లక్షలు ఖర్చవుతాయని తెలపటంతో అవాక్కయ్యాడు. ఇలాగే బీహార్ లోని భోజ్ పూర్ జిల్లా ఆగీయా కు చెందిన గుప్తేశ్వర్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆరు గ్రామాల్లో పి డి ఎస్ కింద పంపిణి చేసిన ఆహార ధాన్యాలు, కిరోసిన్ వివరాలు ఇవ్వాలని కోరగా, పత్రాల జిరాక్స్ ఖర్చుల కింద ఆయనను అడిగింది ఎంతో తెలుసా..అక్షరాలా రూ.78 లక్షలట.సహ చట్టం అమలు లోకి వచ్చి మూడేళ్ళయినా ప్రబుత్వ కార్యాలయాల్లో కంప్యూటరీకరణ జరగకపోవటం, తెలుగు భాషను సమర్దంగా అమలు చేయక పోవటం, అధికారుల నిర్లక్ష్యం వల్ల మున్ముందు ఎవరు దరఖాస్తు ఇచ్చే సాహసం చేయకపోవచ్చు.

3 కామెంట్‌లు:

  1. పొమ్మనకుండా పొగ పెట్టడం అంటే ఇదేనా !!!

    రిప్లయితొలగించండి
  2. అడిగే వాడు డిమాండుగానో, దేబిరిస్తూనో అడగనవసరం లేకుండా, ఇచ్చేవాడు కష్టపడకుండా, అసలు ఇస్తున్నట్లే తెలువకుండా సమాచారం బహిరంగపరిచే అవకాశం పరిపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించడం వలన కలుగుతుంది.

    సమాచారాన్ని కంప్యూటర్ సర్వర్లలో భద్రంగా ఉంచుతూనే అందరికీ అన్ని చోట్లలో ఇంటర్ నెట్ ద్వారా కనపడేట్లు చేసి పారదర్శకత సాధించ వచ్చు. సమాచార హక్కు గురించి స్పృహ ఉన్నవారందరం ఈ విషయాన్ని కూడా గమనించి ప్రభుత్వాలని ఆ దిశగా ఒత్తిడి చేయాలి. అప్పుడు సమాచార హక్కుచట్టం నిర్నిమిత్తంగా సాకారం పొందుతుంది.

    సమాచారహక్కు చట్టం గురించి రాస్తున్న మీకు అభినందనలు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. మీ వ్యాఖ్యలు అక్షర సత్యాలు..ప్రభుత్వం,సమాచార కమీషన్ ఎప్పుడు కళ్ళు తెరుస్తాయో..మీ ప్రోత్సాహానికి కృతజ్ఘతలు.

    రిప్లయితొలగించండి