11 ఆగ, 2008

సమాచారం పొందటం ఎలా? ఎవరికి ధరఖాస్తు చేయాలి? ఎంత మొత్తం చెల్లించాలి? srikantht2005@yahoo.com

సమాచారహక్కుచట్టం,2005 సెక్షన్-6, సబ్ సెక్ష్న్-1 ప్రకారం సమాచారాన్ని పొందగోరువారు ఇంగ్లీశ్ ,హిందీ,లేదా అదికారబాషలో రాతపూర్వకంగా,ఎలక్ట్రానిక్ రూపంలోతమ అభ్యర్దనను ప్రజాసమాచార అధికారి, సహాయప్రజాసమాచార అధికారి కి పోస్టులో ,నేరుగా అందించాల్సి ఉంటుంది.కేంద్ర,రాష్ర్త్రప్రభుత్వాలు ఇప్పటికే అన్ని కార్యాలయాల్లోవి అరిని నియమించాయ్.ఇదే సెక్షన్ లోని సబ్ సెక్షన్-2 ప్రకారం దరఖాస్తులో ఎటువంటి వ్యక్తిగతవివరాలు సమర్పించాల్సిన పనిలేదు.వయస్సు,స్థానికతతో నిమిత్తంలేదు. తిరుగుటపాకు అవసరమైన చిరునామా ఇస్తే సరిపోతుంది. కోరినభాషలో సమాచారం పొందేహక్కు సెక్షన్4(4) కల్పించింది. సమాచారం పొందటానికి విన్నపానికితోడు దరఖాస్తురుసుము చెల్లించటానికి రాష్త్రప్ర ప్రధానపరిపాలన శాఖ (ఐ-పిఆర్) జి.ఓ.యం.ఎస్.నెం:454 తేది:13-10-2005 ద్వారా మార్గదర్శకాలను సూచించింది.దీనిప్రకారం గ్రామస్తాయులో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. మండలస్తాయులో దరఖాస్తు ఒక్కంటికి రూ:5, ఆపైస్తాయులో రూ:10చెల్లించాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు సంబందిత దృవపత్రం జతపరిస్తే ఎలాంటి రుసుం చెల్లించనక్కరలేదు. నగదు, డిమాండు డ్రాప్టు,బ్యాంకర్స్చెక్ ద్వారా దరఖాస్తురుసుం చెల్లించి రసేదు పొందాలి. ఇంతకంటే సులువుగా కూర్టుఫీస్టాంపును, పూస్టల్ ఆర్డర్ ను దరఖాస్తుపై అంటించే పద్దతిని జి.ఓ.ఎం.ఎస్.నెం.740 తేది:01-10-2007 ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ కల్పించింది.వీటితోపాటు సమాచారాన్ని సమకూర్చినందుకు సంబందితశాఖలు ఈ రేట్లను వసూలు చేస్తున్నాయ్. 1) ముద్రించిన ,టెక్స్ట్ రూపంలో నున్న ఎ4,ఎ3సైజు పేపరు ప్రతికాపీకి ఒక్కొపేజీకి రూ-2,అంతకుమించిన సైజులు, మ్యాపులు, ప్లానులకు వాటివాస్తవదర. బి) ఎలక్రానిక్ నమూనాలోనున్న ప్లాపీకి రూ-50, 700ఎంబి సిడికి రూ-100,డివిడికి రూ-200/- చి) రికార్డులతనిఖీకి మొదటిగంటకు రుసుంలేదు. ఆతర్వాత ప్రతిపావు గంటకు రూ-5/- డి) షాంపుల్శ్,మోదల్స్ కు దాని వస్తవధర ఉంటుంది. ఇ) ఫొస్టు ద్వారా పంపిస్తే తపాలా చార్జీలు. పిర్యాదుదారే భరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి