12 ఆగ, 2008
అప్పీలు ఎవరికి చేయాలి? ఎలా చేయాలి? ఏ పత్రాలు జతచేయాలి? pvenkataramanarao@yahoo.com
సమాచార హక్కు చట్టం సెక్షన్-7 లోని సబ్ సెక్షన్-1 ప్రకారం అభ్యర్ధన అందిన 30 రోజుల్లొ పీఐఓ లు సంబందిత సమాచారం అందించాలి.అలా కానీ పక్షంలో ఈ చట్టంలోని సెక్షన్-19, సబ్ సెక్షన్-1 క్రింద కాలపరిమితి ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా మొదటి అప్పీలును ఆపై అధికారికి, జిల్లాఅధికారికి అప్పీలు చేసుకోవచ్చు. తగిన కారణాలు ఉన్నట్లయుతే గడువు ముగిసినా ఆ అప్పీలును స్వేకరించవచ్చు. మొదటి అప్పీలును 30 రోజుల్లో పరిష్కరించాలి.రెండవసారి అప్పీలు చేయదలిస్తే మొదటి అప్పీలు నిర్ణయం వెలువడిన తర్వాత 90 రోజులవరకు ఎప్పుడైనా సమాచార కమీషన్లకు రెండ్వ అప్పీలు చేసుకోవచ్చు.అప్పీలు అందిన 30 రోజుల్లొ పరిష్కరించటం,అవసరమనిపిస్తే మరో 15 రోజులు కాలపరిమితిని పెంచి ఆ అప్పీలును పరిష్కరించటం సమాచార కమీషన్ల విది.మొదటి,రెండవ అప్పీలు చేసుకోవటానికి అభ్యర్ధనలో క్రింది సమాచారం పేర్కొనాలి. అ) అప్పీలు దాఖలు చేసే వ్యక్తిపేరు,చిరునామా. బి) ఎవరి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలును దాఖలు చేయడం జరిగిందో, అందుకు సంబందించి నెంబరుతోసహా ఉత్తర్వు వివరాలు, సి) అప్పీలును ధాఖలు చేయబడినట్టి అంశానికి సంబందించి నెంబరుతో సహా ఉత్తర్వు వివరాలు, డి)అప్పీలు చేయడానికి దారి తీసిన సంగ్రహ వాస్తవాలు. ఇ) దరఖాస్తు నిరాకరణకు వ్యతిరేకంగా అప్పీలును డాఖలు చేసినట్లయుతే దరఖాస్తును ఇచ్చినట్టి (పీఐఎ)పేరు, చిరునామా, సంఖ్య,తేదీతోపాటుదరఖాస్తు వివరాలు.ఎఫ్) కోరిన అభ్యర్ధన లేదా సహాయం. జి) అభ్యర్ధన లేదాసహాయం కోసం గల కారణాలు. హెచ్) అప్పీలు దాఖలు చేసిన వ్యక్తి పరిశీలన ఐ) కమీషన్,అప్పీలును పరిష్కరించటానికి అవసరమని భావించదగు ఏదేని ఇతర సమాచారం.దస్తావేజుల సూచిక.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి