14 ఆగ, 2008
రాష్త్ర పరిదిలో సమాచారహక్కు చట్టం వర్తించని సంస్తలున్నాయా? ఆయా సంస్తలనూంచి సమాచారం పొందటం ఎలా? cvenkatgoud@యాహూ.com
సమాచారహక్కు చట్టం సెక్షన్-24,సబ్ సెక్షన్(4)ప్రకారం రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన ఇంటెలిజెన్స్,భద్రతాసంస్థలకు ఈ చట్టం వర్తించదు. రాష్ట్రప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.667,తేది:03-09-2007 ద్వారా ఈ చట్టం నుంచి మినహాయింపు పొందిన సంస్థలను గెజిట్లో ప్రచురించింది.దీని ప్రకారం 1) స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్,స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్,స్టేట్ సెక్యూరిటివింగ్ 2) స్టేట్ గ్రేహ్యాండ్స్ ఆర్గనైజేషన్ 3) అన్ని జిల్లల ఎస్పీల పరిది లోని స్పెషల్ బ్రాంచ్ లు, 4) అన్ని జిల్లల ఎస్పీల పరిదిలోని సెక్యూరిటి యూనిట్లు, 5) ఎపీఎస్పి, 6) ఎస్పీఎఫ్ 7) స్టేట్ ఆర్ముడ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్ మొదలగు సంస్థలు సమాచారహక్కు చట్టం 2005 నుంచి మినహాయింపు పొంది ఉన్నాయి. ఈ సంస్థలు ప్రబుత్వానికి సమర్పించే ఎలాంటి సమాచారానికి ఈ చట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలకు సంబందించిన సమాచారం అయినప్పుడు ఈ సెక్షన్ నుంచ్ మినహాయింపు ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘణకు సంబందించిన సమాచారం అయితే రాష్ట్ర సమాచార కమీషన్ ఆమోదం పొందిన తర్వాత 45 రోజులలోగా సంబందిత సంస్థ ఈ సమాచారం అందించాల్సి ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి