14 ఆగ, 2008

సమాచార హక్కు చట్టం అమలులో అధికార యంత్రాంగాల పాత్ర (ప్రక్షాళణ)

సమాచారాన్ని పొందటం కొరకు ప్రజలు వీలైనంత తక్కువగా ఈ చట్టాన్ని ఆశ్రయించేలా చూడటానికి ప్రజలు కోరకుండానే వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ప్రసారసాధనాలు, ఇతర మార్గాల ద్వారా అధికార యంత్రాంగాలు ప్రజలకు అందించాలని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తేది నుంచి 120 రోజులలోపు ప్రతి అదికారయంత్రాంగం సమాచారహక్కు సమర్ధంగా అమలయేందుకు తమ దగ్గరున్న అన్ని రికార్డులు, పట్టికలు, పద సూచికలు సక్రమంగా నిర్వహించటం, వీటన్నింటినీ క్రోడీకరించి కంప్యూటర్ లో నిక్షిప్తం చేయడం, సమాచారం అందుభాటులో ఉండేదుకు ఇంటర్నెట్ లో ఉంచటం, వంటి పనులు చేయడం ప్రభుత్వ శాఖల విధి. ఈ చట్టం ప్రకారం ఈ క్రింది అంశాలను విదిగా పేర్కొనాల్సి ఉంది. 1) ప్రతి అధికార యంత్రాంగానికి సంబందించిన వివరాలు,విదులు,ఆ శాఖ అధికారులు, ఉద్యోగులకున్న అధికారాలు.2) పర్యవేక్షణ, జవాబుదారీ తనానికి సంబంధించిన మార్గాలతో పాటు ,నిర్ణయ పక్రియలో అనుసరించే విధానాలు, కార్యనిర్వాహణలో పాటించే సూత్రాలు. 3) ఆ శాఖ ఉద్యోగులు పాటించే నియమనిబందనలు,ఆదేశాలు, మాన్యువళ్ళు,రికార్డులు. 4) ఆశాఖ దగ్గర ఉన్న పత్రాల రకాలకు సంబదించిన ప్రకటన. 5) ఆ శాఖ విదానాల రూపకల్పన కోసం, ప్రజల భాగస్వామ్యం స్వీకరించేందుకు ఉన్న పద్దతులు. 6) ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు పొందే నెలవారీ వేతనం,పరిహారం చెల్లింపు వివరాలు,సమాచార సంపుటి.7) అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు,జరిపిన చెల్లింపుల వివరాలు.8) సబ్సిడి పథకాల అమలుతీరు, వాటికి కేటాయించిన నిదులు, ఆ పథకాల లబ్దిదారుల వివరాలు.9) ఆ శాఖ మంజూరు చేసే రాయితీలు, పర్మిట్లు,అనుమతులు పొందుతున్న వారి వివరాలు. 10) ఆ శాఖ పరిదిలోని బోర్డులు,ఏజన్సీలు, కమిటీలు, సంస్థలకు చెందిన సమస్థ వివరాలు. 11)ప్రతి శాఖ తన పరిది లోని కార్యాలయాలలో గల పౌర సమాచార అధికారుల పేర్లు,హోదాలు,ఇతర వివరాలు ప్రజలకు తెలిసేట్లు ఉంచాలి. 12) ప్రతి యేడాది అప్ డేట్ చేస్తూ తాజా సమాచారాన్ని ప్రకటించడం. ఇవేగాక ముఖ్యమైన విధానాల రూపకల్పన, ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు వాటికి సంబందించిన వాస్తవాలను ప్రచురించాలి. ప్రజల అభ్యర్ధనతో నిమిత్తం లేకుండా పై సమాచారాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల ముందుంచాల్సిన భాద్యత ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి