14 ఆగ, 2008

సమాచార హక్కు చట్టం ఆచరణలో విపలం కావటానికి కారణాలు జి.నరసింహారావు (ప్రక్షాలన)

-: సమాచార హక్కు చట్టం ఆచరణలో విపలం కావటానికి కారణాలు :- 1) ఈ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించకపోవటం,ఈ చట్టం అమలులోకి వచ్చి మూడేళ్ళయినా సరైన ప్రచారం కల్పించక పోవడం, 2) పి.ఐ.ఎ,ఏపీ.ఐ.ఎ లకు శిక్షణ నిప్పించక పోవటం, 3) సమాచార కమీషన్ కు నిదులలేమి, సరైన సిబ్బంది లేకపోవటం. 4) అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తుగా తమ విభాగానికి సంబందించిన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచక పోవటం 5) ప్రభుత్వ ఆపీసుల్లో పూర్థి స్తాయులో కంప్యూటరీకరణ జరగక పోవటం,చాలా శాఖలు తెలుగు సాప్ట్ వేరును సమకూర్చుకోకపోవటం, 6) తక్షణమే పరిష్కరించ దగిన అభ్యర్దనలను నెలరోజుల దాకా తమ దగ్గర పెండింగులో ఉంచుకోవటం.7) సమాచారాన్ని ఇవ్వని అదికారులకు జరిమానాలు, శిక్షలు లేకపోవటం 8) అత్యదికులు నిరక్షరాస్యు లైనందున దరఖాస్తు చేసుకొనే విధానం తెలియకపోవటం 9) దరఖాస్తు రుసుము చెల్లింపులో స్పష్టమైన విధానం పాటించక పోవటం, 10) సిటిజన్ చార్టర్ ను ప్రబుత్వ విభాగాలు సరిగా అమలు చేయక పోవటం,11)వ్యవస్తలో పేరుకు పోయున అవినీతి, లంచగొండితనం ఈ చట్టం అమలుకు ప్రతిబందకాలుగా తయారయ్యాయి. అర్ద శతాబ్దిగా అలవాటుపడిన విధానం నుంచి ప్రభుత్వ యంత్రాంగం బయటపడలేకపోతుంది. ప్రజల్లో చైతన్యం వస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

1 కామెంట్‌:

  1. చాలా చక్కటి సమాచారం అందించారు.కృతజ్ఞతలు.
    Thought you will be interested in :

    www.loksattasanjeevani.in

    రిప్లయితొలగించండి