26 జులై, 2009
లోక్ సత్తా బిల్లుకు మద్దతు తెలపండి
అవినీతిపై ' ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్ మెంట్ యాక్ట్-2009 ' ముసాయిదా బిల్లును లోక్ సత్తా రూపొందించింది. ఈ బిల్లును చట్ట రూపంలో తీసుకురావటానికి వీలుగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టటానికి ప్రజల తరపున ప్రబుత్వంపై ఒత్తిడి తీసుకు రావటానికి ప్రయత్నాలు ప్రారంబించింది. బిల్లు ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుగా రాష్త్ర ప్రజానీకం తరపున ముఖ్యమంత్రికి పిటిషన్ సమర్పించాలని నిర్ణయించారు.
ఈమేరకు యాక్టు, పిటిషన్ ను నెట్ లో ఉంచి సంతకాల సేకరణ చేపట్టారు. స్పీకర్, మండలి చైర్మన్, ప్రతిపక్ష నేత, అన్ని పార్టీల అద్యక్షులు, ప్లోర్ లీడర్లు, న్యాయ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రుల కు ఈ డాక్యుమెంట్ లను అందజేయ నున్నారు.
అమెండ్ మెంట్ యాక్టు డ్రాప్టు ను బొలిశెట్టి కపిలేశ్వర్ రూపొందించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రస్తుతమున్న చట్టం ద్వారా సాద్యపడదని కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇందులో సూచించారు.
అమెండ్ మెంట్ లో కొన్ని ముఖ్యమైన సూచనలు:-
*ప్రబుత్వ అధికారులు అవినీతికి పాల్పడినపుడు వారి ఆస్థుల జప్తు,సస్పెన్షన్ లో నిఘా అధికారులకు నిబందనలను సులభతరం చేయడం.
*ప్రతి జిల్లాలో ప్రత్యేక అవినీతి నిరోధక కోర్టుల ఏర్పాటు.
*లోకాయుక్థ పరిధిలో స్వయంప్రతిపత్తి కల్గిన అవినీతి నిరోధక సంస్థ ఏర్పాటు.
*అక్రమ ఆస్థులు కల్గి, లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి నేరం ఒప్పుకున్న వారిని నేరస్తులుగా పరిగణించాలి.
అవినీతి రహిత సమాజాన్ని కాంక్షించే వారు ఈ పిటిషన్ కు మీ మద్దతు తెలపండి. మీపేరు, ఈ-మెయిల్, బిల్లుపై మీ ఆమోదం తెలియజేస్తూ సంతకం చేయండి. మీ మిత్రులకు తెలియ జేయండి.
లోక్ సత్తా సూచిస్తున్న ముసాయిదా డాక్యుమెంట్ ను ఇక్కడ చూడండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి