5 సెప్టెం, 2008

అవినీతి రహిత సమాజ నిర్మానానికి "ఎసిబి" ౪౭ యేళ్ళుగా తీవ్ర కృషి


"ఎసిబి"(యాంటీ కరప్షన్ బ్యూరో) ఈ పేరు రాష్ట్ర పబుత్వ ఉద్యోగులకు ముచ్చెమటలు పడతాయి. మంచి పరిపాలన జరగాలన్నా, ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరాలన్నా పాలకులు, ప్రబుత్వోద్యోగులు నిస్వార్దం తో పనిచేయాలి. ఉద్యోగులు గాడితప్పితే వ్యవస్త పై తీవ్ర ప్రభావం చూపుతుంది. గాడితప్పిన ఉద్యోగులను సక్రమ మార్గంలో పెట్టడానికి,అవినీతి రహిత సమాజ నిర్మానానికి "ఎసిబి" గత 47 యేళ్ళుగా తీవ్ర కృషి చేస్తోంది. 1961 జనవరి 2 న స్థాపితమైన ఎసిబి అర్ధ శతాబ్ది వైపు పయనిస్తుంది.సాధారణ పరిపాలన విభాగం (జిఎడి)పరిధిలో పనిచేసే ఎసిబి కి సీనియర్ ఐపియస్ అధికారిని డైరెక్టర్ జనరల్ గా ప్రబుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం ఆర్.ఆర్.గిరీష్ కుమార్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. ఎసిబి 15 రేంజ్ లుగా విభజించబడి రాష్త్ర మంతటా విస్తరించియుంది.ప్రతి రేంజ్ కు ఒక డిఎస్పీ స్తాయి అధికారి,3నుంచి5గురు ఇన్స్ పెక్టర్లు ఉంటారు.ఒకటి నుంచి మూడు జిల్లాలకు కలిపి ఒక రేంజ్ ఏర్పాటయింది.ఇంకా బ్యూరోలో టెక్నికల్ ఆపీసర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్, లీగల్ ఆపీసర్లు ఉంటారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్-1988 ననుసరించి ఎసిబి ముందుకు సాగుతుంది. లంచగొండి అదికారులను రెడ్ హ్యాండెడ్ గాపట్టుకోవటం,కేసులు నమోదు చేసి శిక్షలు పడేట్లు చూడటం, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, ఆధాయానికి మించిన ఆస్తులనుకనుగొనటం ఎసిబి ప్రధాన భాద్యతలు. వచ్చిన వార్తలు, ఇతర సమాచారాన్ని ఎసిబి "సుమోటొ"గా స్వీకరిస్తుంది. రాష్ట్ర ప్రబుత్వ పరిధిలోని కార్యాలయాలు, స్థానికసంస్థలు, కార్పోరేషన్లలో పనిచేసే ఉధ్యోగుల అవినీతిపై ఎవరైనా ఎసిబి కి పిర్యాదు చేయవచ్చు. సమాచారమందించవచ్చు. సమీపంలోని ఎసిబి అధికారిని నేరుగా, పోనులో సంప్రదించవచ్చు. రాతపూర్వకంగా, ఈ-మెయిల్ ద్వారా పిర్యాదు పంపవచ్చు. పిర్యాదు దారులను ఎసిబి సురక్షితంగా కాపాడుతుంది.రక్షణ కల్పిస్తుంది. కేసు ప్రాధాన్యత ఆధారంగా రివార్డు కూడా ఇస్స్తంది. ఇటీవలి కాలంలో మీడియాతో కలసి కూడా ఎసిబి జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా ఎప్పటి కప్పుడు కేసుల వివరాలు తెలియజేస్తంది.

1 కామెంట్‌:

  1. వారు ఎంత కష్టపడి అవినీతిపై కేసులు పెట్టినా తర్వాత దానికి పాల్పడినవారిపై చర్యలను సమర్థవంతంగా తీసుకుంటే గదా వారి కృషికి సార్థకత సిద్దించేది.

    రిప్లయితొలగించండి