9 సెప్టెం, 2008

ఐడి ఉపయోగించడం ద్వారా ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో అక్రమాలకు "చెక్"


ఇందిరమ్మ పథకం క్రింద మంజూరు చేస్తోన్న ఇళ్ళలో అక్రమాలు జరగకుండా చూసుకునే అవకాశం ఇప్పుడు లబ్దిదారులకు లభించింది.ఈ పథకం పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో గృహ నిర్మాణ శాఖ లబ్ది దారుల జాబితా తో పాటు పూర్తి వివరాలను ఆన్ లైన్ లో ఉంచింది.ఇందిరమ్మ పేరిట వెబ్ సైట్ ను ఓపెన్ చెసి మొదటి రెండు విడతలకు సంబందించిన సమాచారాన్ని ఇందులో పొందుపర్చింది.లబ్దిదారు పేరు,ఐడి నెం,పథకంపేరు, ఇంటి నిర్మాన దశ, సిమెంట్, నగదు చెల్లింపు వివరాలు ఉన్నాయి. మూడవ విడత వివరాలు నమోదు చేసే పక్రియ కూడా మొదలైంది. ఇందిరమ్మ పథకంలో లబ్ది దారుల ఎంపిక పక్రియ మొదలు చివరివరకు రాజకీయ జోక్యం,అదికారుల అవినీతి వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరలేదు.ప్రబుత్వం లక్షల్లో ఇళ్ళిచ్చామని చెబుతున్నా,అదే సంఖ్యలో ఇంకా పేదలు గూడు కోసం నిరీక్షిస్తుండటం ఈ పథక వైపల్యాలను చెప్పకనే చెబుతుంది. అనర్హులే ఒక్కొక్కరు రెండేసి,మూడేసి ఇళ్ళను మంజూరు చేయించుకొని భవంతులు కట్టడం మన కళ్ళ ముందే కనిపిస్తంది.గతంలో మంజూరైన వారికే మళ్ళీ బినామీ పేర్లతో మంజూరు,ఊర్లో లేని వారికి ఇండ్లు,పాత ఇండ్లకే మెరుగులు ఇదీ గ్రామాల్లో పలుకుబడి కల్గిన వారి పరిస్తితి.ఇక పేదలకు ఇళ్ళు మంజూరైనా ఎంత వస్తుందో, ఎంత ఇస్తారో వర్క్ ఇన్స్ పెక్టర్ల ధయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది.బ్యాంకు పత్రాలపై ముందే సంతకం తీసుకుని నగదు వారే మినహాయించుకొని ఇస్తారు.లక్ష వ్యయం చేస్తే కానీ పూర్తి కాని ఇల్లుకు ప్రబుత్వమిచ్చే ముప్పై వేల సాయం ఏ మూలకు సరి పోక బలహీన వర్గాలు మద్యలో నిర్మాణం ఆపేస్తే , పూర్తయినట్లుగా చూపి ఆ సొమ్ము కాజేస్తున్నారు. ఇకనైనా మేల్కోండి..అక్రమాలను అడ్డుకోండి..గృహం మంజూరు వెంట ఇచ్చిన ఐడి కార్డు నెంబరును ఇందిరమ్మ వెబ్ సైట్లో నమోదు (ఎంటర్) చేసి క్లిక్ చేస్తే మీ ఇంటికి సంబందించిన వివరాలు,సిమెంట్, నగదు చెల్లింపు వివరాలు తెలుస్తాయి.లేదా జిల్లా,మండలం,గ్రామమం ఎంపికచేసి మీ గ్రామాంలో ఇళ్ళు మంజూరైన వారి పూర్తి జాబితా పొందవచ్చు.వీరిలో ఎవరు అర్హులో, ఎవరు అన ర్హులో తెలుకోవటం ఇట్టే తెలిసి పోతుంది.ఇక్కడ ఇచ్చిన పోటోలలో స్కీం కు సంబందించిన వివరాలను ఇచ్చాం.వాటిని బేరీజు వేసుకోండి. (ఇందిరమ్మ అక్రమాలపై పిర్యాదు చేయట మెలాగో మరో వార్త లో తెలుసుకుందాము)

1 కామెంట్‌:

  1. శ్రిశ్రిశ్రి వయ్.స్ మొండి మెంటల్ రెడ్ది గారి కి ఇలాంటి వి ఎందుకు అవసరం లెదు అంటె

    1. అసలు తప్పుల్ లెని దెవుని పరిపాలన మాది
    2. ఫలానా వాల్లు తప్పు చెస్త్ లెదు కాని మెము చెస్తె తప్పా
    3. అ పదకానికి ఇందిరమ్మ పరు పెట్టాం కావున అంతా కరెక్తె
    4. మా పార్తి కదా కావున అంతా కరెక్తె
    5. సొనియ కి డబ్బాలు పంపబడినవి కావున అంతా కరెక్తె

    రిప్లయితొలగించండి