27 ఆగ, 2008

సిబిఐ ని ఆశ్రయించటం ఎలా?

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)1969 ఏప్రిల్ 1 న ఆవిర్బవించింది.అంతకు పూర్వం డిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్(డి ఎస్ పి ఇ)గా పిలవబడేది. అవినీతి నిరోధన, ఆర్దిక నేరాలకు అడ్డుకట్ట, అదిక ప్రాధాన్యత కల్గిన కేసుల పరిశోధన సి.బి.ఐ విదులు. సి.బి.ఐ డైరెక్టర్ గా ప్రస్తుతం అశ్వని కుమార్ బాద్యతలు నిర్వహిస్తున్నారు.సి బి ఐ పరిదిలో 17 జోన్లు ఉండగా, 11 విభాగాలు పనిచేస్తున్నాయి. సౌత్ జోన్ పరిదిలో చెన్నై, హైదరాబాద్ రీజియన్లు ఉండగా, హైదరాబాద్ రీజియన్ లో హైదరాబాద్, విశాఖపట్టణం,బెంగుళూరు లో సి.బి.ఐ, యాంటీ కరప్షన్ బ్యూరో కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో డిఐ జి,ఒక ఎస్పీ తో పాటు విశాఖపట్టణం లో ఇద్దరు ఎస్పీలు,బెంగుళూరు లో ఒక ఎస్పీ స్థాయి అధికారులున్నారు.కేంద్ర ప్రబుత్వ కార్యాలయాలు,ప్రబుత్వరంగ సంస్తలు,ప్రబుత్వ రంగ బ్యాంకుల లొ పనిచేసే అదికారులు ఈ క్రింది పద్దతులకు పాల్పడితే వీరికి పిర్యాదు చేయవచ్చు.మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.తప్పుడు సమాచారాన్ని సిబిఐ స్వీకరించదు. 1) కేంద్ర ప్రబుత్వ ఉద్యోగి లంచం అడిగినా, 2) స్తిర, చరాస్తులు చట్ట వ్యతిరేక పద్దతులలో ఏ కేంద్ర ప్రబుత్వోద్యోగి సంపాదించినా, 3) అదికార దుర్వినియోగంచేసి ఏ ప్రబుత్వ ఉద్యొగి తనకు గానీ, ఇంకెవరికి గానీ ఆర్దిక లాభాన్ని కలుగచేసినా, 4) పై సమాచారం కేంద్ర ప్రబుత్వ ఉద్యోగులకు అనగా కేంద్ర ప్రబుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలలో పనిచేయు ఉద్యోగుల గురించి ఇవ్వవలెను.మీరు స్పందించినా సిబిఐ స్పందిస్తుంది.సిబిఐ కి సహకరించండి. అది మీకు సహకరిస్తుంది.స్వచ్చమైన ప్రబుత్వ పాలన అందించడం కోసం సిబిఐ కి చేయూత నివ్వండి. నేరుగా, పోన్ ద్వారా, ఈ-మెయిల్, పోస్టు ద్వారా సిబిఐ అదికారులను సంప్రదించవచ్చు. సి బి ఐ కార్యాలయాల వివరాలు: హైదరాబాద్:- కేంద్రీయ అన్వేషణ సంస్థ (సిబిఐ) కేంధ్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్- 500095 పోన్ నెం: 24732768, 24732764 సెలవుదినాలు: 24732762, 24732763 విశాఖపట్టణం: 1-83-21/4,ఎం.వి.పి.కాలనీ, సెక్టార్-8, విశాఖపట్టణం పోన్:0891-2783333,బెంగుళూరు: 36,బళ్ళారి రోడ్ ,గంగానగర్,బెంగుళూరు పోన్: 080-23332726/1026 అదికారులు: హైదరాబాద్:-వి.వి.లక్ష్మినారాయణ డిఐజి(ఎసిఆర్)పోన్:040-24653986 ఈ-మెయిల్: digachyd@cbi.gov.in ఎ.వై.వి.క్రిష్ణ, ఎస్పీ, ఈ-మెయిల్: spachyd@cbi.gov.in విశాఖపట్టణం :-1) జి.నాగేశ్వర్ రావు, ఎస్పీ-1, ఈ-మెయిల్: spacvizag@cbi.gov.in 2)ఎస్పీ-2 వెకెన్సీ .బెంగుళూరు :-ఎన్.ఎన్.కుమార్ ఎస్పీ, ఈ-మెయిల్: spacblr@cbi.gov.in

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి