20 ఆగ, 2008
సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలను అడ్డుకునేదెలా?
సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్ల చేతివాటం వల్ల విద్యార్దులకు పౌష్టికాహారం అందటం లేదు. బోగస్ విద్యార్దులను అదికంగా చూపించటం వల్ల ప్రబుత్వ ఖజానాకు గండిపడుతుంది. మెనూ సక్రమంగా పాటించటం,ఇతర సామాగ్రి అందేలా చూస్తే వసతి గృహాల్లో అవినీతిని అడ్డుకోవచ్చు. ప్రతి బోర్డరు మెస్ చార్జీలు,మెనూ,ప్రబుత్వం నుంచి తమకు దక్కాల్సిన సామాగ్రి గురించి లుసుకోవాల్సిన అవసరముంది. మెస్ చార్జీలు: స్పెషల్ హాస్టల్ విద్యార్దులకు ప్రతిరోజు రూ:17.25 చొప్పున నెలకు రూ: 535/-,సాధారణ విద్యార్దులకు ప్రతిరోజు రూ:15.32 చొప్పున నెలకు రూ: 475/-చొప్పున ప్రబుత్వం విడుదల చేస్తోంది. ప్రతి రోజు ఉదయం ఉపాహారం(టిపిన్),రెండు పూటలా బోజనం ఇవ్వాలి. వీటితో పాటు ప్రతి రోజు స్నాక్స్,రెండు రోజులు పండ్లు, నెలలో రెండు సార్లు చికెన్ ,వారంలో ఐదు రోజులు గుడ్లు,రోజు మజ్జిగ, ఆదివారం స్వీట్ ఇవ్వాలి. అదనంగా సబ్బుల బిల్లు కింద అబ్బాయిలకు నెలకు రూ: 50/-,హేర్ కటింగ్ చార్జీలు రూ: 12/-,మరియు అమ్మాయిలకు స్పెషల్ హాస్టల్ వారికి రూ:75+15/-,ఇతరులకు రూ: 75/-ఇవ్వాలి.ప్రతి యేటా ప్రతి విద్యార్దికి నాలుగు జతల దుస్తులు,బెడ్ షీట్, కార్పెట్ ఒక్కోటి చొప్పున ఇవ్వాలి.ఇంకా నోట్ బుక్స్,స్టడీ మెటీరియల్,క్వశ్చన్ బ్యాంక్(మాబడి,పాఠశాల)ఇవ్వాలి. కొత్తగా చేరే విధ్యార్దులకు ప్లేటు,గ్లాసు అదనం. స్పెషల్ హాస్టళ్ళలో ఏడాది పొడవునా నలుగురు ట్యూటర్లను నియమించాలి. హాస్టళ్ళలో విధ్యార్దుల రేషియో: సాంఘీఖ సంక్షేమ హాస్టళ్ళు- 70%ఎస్సీ, 12%హెచ్ సీ, 9%బీసీ,5%ఎస్టీ, 4%ఓసీ. గిరిజన సంక్షేమ హాస్టళ్ళు:- 70%ఎస్టీ,10%బీసీ, 10%ఎస్సీ,5%హెచ్ సీ,5%ఓసీ. బోగస్ విద్యార్దుల గుర్తింపు:- ఎస్టీ హాస్టళ్ళలో ఈ బెడద ఎక్కువ. 300 కు పైగా బోర్డర్లున్న హాస్టళ్ళు ఎన్నో ఉన్నాయి.వీటిలో విద్యార్దుల సంఖ్యను అదికంగా చూపి వార్డెన్లు మెస్ చార్జీలు కాజేస్తున్నారనేది ప్రధాన ఆరోపన్ణ్. నిర్నీత సంఖ్యలో విధ్యార్దులు హాస్టళ్ళలో ఉండకపోతే బోజన వేలలో అటెండెన్స్ పరిశీలించటం ద్వారా నిర్ధారించుకోవచ్చు. లేదా యస్.టి.ఓ కార్యాలయాల్లో వార్డెన్లు సమర్పించే బిల్లు పత్రాలలో 1టు4 బ్యాలన్స్ షీట్ పత్రాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసు కునే వీలుంది. తద్వారా హాస్టళ్ళలో అక్రమాలకు బ్రేకులు వేయవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి