గృహ నిర్మాణ శాఖ లో లబ్ది దారుల నుంచి వచ్చే పిర్యాదు లను సి.ఆర్.ఎస్ (కంప్లయింట్ రెడెస్సల్ సిస్టం )విదానాన్ని అమలు చేస్తున్నారు.పిర్యాదు లో పారదర్శకత ఉండటానికి ఈవిదానాన్ని అవలంబిస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించుకుంది.గృహనిర్మాణం లో మెటీరియల్ కొరత, లబ్ది దారుల జాబితా నుంచి అర్హుల తొలగింపు, బిల్లుల చెల్లింపు లో ఆలస్యం,అక్రమ వసూళ్ళు,నిర్మాణ లోపాలు తధితర విషయాలపై ఉచిత "టోల్ ప్రీ నెం" 1100 కు పోన్ చేసి పిర్యాదు చేయవచ్చు.మీ పేరు, పోన్ నెంబరు,విషయం,పిర్యాదు, ఎవరిపై పిర్యాదు చేస్తున్నారో వారి వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది. మీ పిర్యాదును నమోదు చేసే ఆపరేటర్ మీకోక డాకెట్ నెంబరు కేటాయిస్తారు.మీ పిర్యాదును ఇందిరమ్మ.డాట్ కాం వెభ్ సైట్ లో చూడవచ్చు. ఎస్.ఎం.ఎస్ విధానం ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాటైన "కాల్ సెంటర్లు" కు సందేశాన్ని పంపి పిర్యాదును పరిష్క రిస్తారు.ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా 1676 పిర్యాదులు అందగా,వీటిలో 549 పిర్యాదులను తిరస్కరించారు.153 ఫెండింగులో ఉంచారు. మిగిలిన 974 పిర్యాదులను వెబ్ సైట్లో పరిష్కారం కొరకు ఉంచారు.ఇంకా పరిపాలనా పరమైన విషయాలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలియ జేయ వచ్చు. 1) ఆర్.సుబ్రమన్యం,ఐ.ఎ.ఎస్,ఎం డి ,గృహ నిర్మాణ శాఖ, పోన్: 040-23228930 2) కె.రాంగోపాల్,ఐ.ఎ., ఇడి ,గృహ నిర్మాణ శాఖ, పోన్:040_232228930
మేలుకొలుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మేలుకొలుపు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
9 సెప్టెం, 2008
గృహ నిర్మాణం లో అక్రమ వసూళ్ళపై సి.ఆర్.ఎస్ విధానం ద్వారా పిర్యాదు
గృహ నిర్మాణ శాఖ లో లబ్ది దారుల నుంచి వచ్చే పిర్యాదు లను సి.ఆర్.ఎస్ (కంప్లయింట్ రెడెస్సల్ సిస్టం )విదానాన్ని అమలు చేస్తున్నారు.పిర్యాదు లో పారదర్శకత ఉండటానికి ఈవిదానాన్ని అవలంబిస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించుకుంది.గృహనిర్మాణం లో మెటీరియల్ కొరత, లబ్ది దారుల జాబితా నుంచి అర్హుల తొలగింపు, బిల్లుల చెల్లింపు లో ఆలస్యం,అక్రమ వసూళ్ళు,నిర్మాణ లోపాలు తధితర విషయాలపై ఉచిత "టోల్ ప్రీ నెం" 1100 కు పోన్ చేసి పిర్యాదు చేయవచ్చు.మీ పేరు, పోన్ నెంబరు,విషయం,పిర్యాదు, ఎవరిపై పిర్యాదు చేస్తున్నారో వారి వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది. మీ పిర్యాదును నమోదు చేసే ఆపరేటర్ మీకోక డాకెట్ నెంబరు కేటాయిస్తారు.మీ పిర్యాదును ఇందిరమ్మ.డాట్ కాం వెభ్ సైట్ లో చూడవచ్చు. ఎస్.ఎం.ఎస్ విధానం ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాటైన "కాల్ సెంటర్లు" కు సందేశాన్ని పంపి పిర్యాదును పరిష్క రిస్తారు.ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా 1676 పిర్యాదులు అందగా,వీటిలో 549 పిర్యాదులను తిరస్కరించారు.153 ఫెండింగులో ఉంచారు. మిగిలిన 974 పిర్యాదులను వెబ్ సైట్లో పరిష్కారం కొరకు ఉంచారు.ఇంకా పరిపాలనా పరమైన విషయాలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలియ జేయ వచ్చు. 1) ఆర్.సుబ్రమన్యం,ఐ.ఎ.ఎస్,ఎం డి ,గృహ నిర్మాణ శాఖ, పోన్: 040-23228930 2) కె.రాంగోపాల్,ఐ.ఎ., ఇడి ,గృహ నిర్మాణ శాఖ, పోన్:040_232228930 ఐడి ఉపయోగించడం ద్వారా ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో అక్రమాలకు "చెక్"

ఇందిరమ్మ పథకం క్రింద మంజూరు చేస్తోన్న ఇళ్ళలో అక్రమాలు జరగకుండా చూసుకునే అవకాశం ఇప్పుడు లబ్దిదారులకు లభించింది.ఈ పథకం పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో గృహ నిర్మాణ శాఖ లబ్ది దారుల జాబితా తో పాటు పూర్తి వివరాలను ఆన్ లైన్ లో ఉంచింది.ఇందిరమ్మ పేరిట వెబ్ సైట్ ను ఓపెన్ చెసి మొదటి రెండు విడతలకు సంబందించిన సమాచారాన్ని ఇందులో పొందుపర్చింది.లబ్దిదారు పేరు,ఐడి నెం,పథకంపేరు, ఇంటి నిర్మాన దశ, సిమెంట్, నగదు చెల్లింపు వివరాలు ఉన్నాయి. మూడవ విడత వివరాలు నమోదు చేసే పక్రియ కూడా మొదలైంది. ఇందిరమ్మ పథకంలో లబ్ది దారుల ఎంపిక పక్రియ మొదలు చివరివరకు రాజకీయ జోక్యం,అదికారుల అవినీతి వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరలేదు.ప్రబుత్వం లక్షల్లో ఇళ్ళిచ్చామని చెబుతున్నా,అదే సంఖ్యలో ఇంకా పేదలు గూడు కోసం నిరీక్షిస్తుండటం ఈ పథక వైపల్యాలను చెప్పకనే చెబుతుంది. అనర్హులే ఒక్కొక్కరు రెండేసి,మూడేసి ఇళ్ళను మంజూరు చేయించుకొని భవంతులు కట్టడం మన కళ్ళ ముందే కనిపిస్తంది.గతంలో మంజూరైన వారికే మళ్ళీ బినామీ పేర్లతో మంజూరు,ఊర్లో లేని వారికి ఇండ్లు,పాత ఇండ్లకే మెరుగులు ఇదీ గ్రామాల్లో పలుకుబడి కల్గిన వారి పరిస్తితి.ఇక పేదలకు ఇళ్ళు మంజూరైనా ఎంత వస్తుందో, ఎంత ఇస్తారో వర్క్ ఇన్స్ పెక్టర్ల ధయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది.బ్యాంకు పత్రాలపై ముందే సంతకం తీసుకుని నగదు వారే మినహాయించుకొని ఇస్తారు.లక్ష వ్యయం చేస్తే కానీ పూర్తి కాని ఇల్లుకు ప్రబుత్వమిచ్చే ముప్పై వేల సాయం ఏ మూలకు సరి పోక బలహీన వర్గాలు మద్యలో నిర్మాణం ఆపేస్తే , పూర్తయినట్లుగా చూపి ఆ సొమ్ము కాజేస్తున్నారు. ఇకనైనా మేల్కోండి..అక్రమాలను అడ్డుకోండి..గృహం మంజూరు వెంట ఇచ్చిన ఐడి కార్డు నెంబరును ఇందిరమ్మ వెబ్ సైట్లో నమోదు (ఎంటర్) చేసి క్లిక్ చేస్తే మీ ఇంటికి సంబందించిన వివరాలు,సిమెంట్, నగదు చెల్లింపు వివరాలు తెలుస్తాయి.లేదా జిల్లా,మండలం,గ్రామమం ఎంపికచేసి మీ గ్రామాంలో ఇళ్ళు మంజూరైన వారి పూర్తి జాబితా పొందవచ్చు.వీరిలో ఎవరు అర్హులో, ఎవరు అన ర్హులో తెలుకోవటం ఇట్టే తెలిసి పోతుంది.ఇక్కడ ఇచ్చిన పోటోలలో స్కీం కు సంబందించిన వివరాలను ఇచ్చాం.వాటిని బేరీజు వేసుకోండి. (ఇందిరమ్మ అక్రమాలపై పిర్యాదు చేయట మెలాగో మరో వార్త లో తెలుసుకుందాము)
20 ఆగ, 2008
సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలను అడ్డుకునేదెలా?
సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్ల చేతివాటం వల్ల విద్యార్దులకు పౌష్టికాహారం అందటం లేదు. బోగస్ విద్యార్దులను అదికంగా చూపించటం వల్ల ప్రబుత్వ ఖజానాకు గండిపడుతుంది. మెనూ సక్రమంగా పాటించటం,ఇతర సామాగ్రి అందేలా చూస్తే వసతి గృహాల్లో అవినీతిని అడ్డుకోవచ్చు. ప్రతి బోర్డరు మెస్ చార్జీలు,మెనూ,ప్రబుత్వం నుంచి తమకు దక్కాల్సిన సామాగ్రి గురించి లుసుకోవాల్సిన అవసరముంది. మెస్ చార్జీలు: స్పెషల్ హాస్టల్ విద్యార్దులకు ప్రతిరోజు రూ:17.25 చొప్పున నెలకు రూ: 535/-,సాధారణ విద్యార్దులకు ప్రతిరోజు రూ:15.32 చొప్పున నెలకు రూ: 475/-చొప్పున ప్రబుత్వం విడుదల చేస్తోంది. ప్రతి రోజు ఉదయం ఉపాహారం(టిపిన్),రెండు పూటలా బోజనం ఇవ్వాలి. వీటితో పాటు ప్రతి రోజు స్నాక్స్,రెండు రోజులు పండ్లు, నెలలో రెండు సార్లు చికెన్ ,వారంలో ఐదు రోజులు గుడ్లు,రోజు మజ్జిగ, ఆదివారం స్వీట్ ఇవ్వాలి. అదనంగా సబ్బుల బిల్లు కింద అబ్బాయిలకు నెలకు రూ: 50/-,హేర్ కటింగ్ చార్జీలు రూ: 12/-,మరియు అమ్మాయిలకు స్పెషల్ హాస్టల్ వారికి రూ:75+15/-,ఇతరులకు రూ: 75/-ఇవ్వాలి.ప్రతి యేటా ప్రతి విద్యార్దికి నాలుగు జతల దుస్తులు,బెడ్ షీట్, కార్పెట్ ఒక్కోటి చొప్పున ఇవ్వాలి.ఇంకా నోట్ బుక్స్,స్టడీ మెటీరియల్,క్వశ్చన్ బ్యాంక్(మాబడి,పాఠశాల)ఇవ్వాలి. కొత్తగా చేరే విధ్యార్దులకు ప్లేటు,గ్లాసు అదనం. స్పెషల్ హాస్టళ్ళలో ఏడాది పొడవునా నలుగురు ట్యూటర్లను నియమించాలి. హాస్టళ్ళలో విధ్యార్దుల రేషియో: సాంఘీఖ సంక్షేమ హాస్టళ్ళు- 70%ఎస్సీ, 12%హెచ్ సీ, 9%బీసీ,5%ఎస్టీ, 4%ఓసీ. గిరిజన సంక్షేమ హాస్టళ్ళు:- 70%ఎస్టీ,10%బీసీ, 10%ఎస్సీ,5%హెచ్ సీ,5%ఓసీ. బోగస్ విద్యార్దుల గుర్తింపు:- ఎస్టీ హాస్టళ్ళలో ఈ బెడద ఎక్కువ. 300 కు పైగా బోర్డర్లున్న హాస్టళ్ళు ఎన్నో ఉన్నాయి.వీటిలో విద్యార్దుల సంఖ్యను అదికంగా చూపి వార్డెన్లు మెస్ చార్జీలు కాజేస్తున్నారనేది ప్రధాన ఆరోపన్ణ్. నిర్నీత సంఖ్యలో విధ్యార్దులు హాస్టళ్ళలో ఉండకపోతే బోజన వేలలో అటెండెన్స్ పరిశీలించటం ద్వారా నిర్ధారించుకోవచ్చు. లేదా యస్.టి.ఓ కార్యాలయాల్లో వార్డెన్లు సమర్పించే బిల్లు పత్రాలలో 1టు4 బ్యాలన్స్ షీట్ పత్రాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసు కునే వీలుంది. తద్వారా హాస్టళ్ళలో అక్రమాలకు బ్రేకులు వేయవచ్చు.
16 ఆగ, 2008
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అడ్డుకోవటమెలా?
రిజిస్ట్రేషన్ శాఖ సమర్దవంతంగా పనిచేయటానికి 1999 నుంచి ప్రభుత్వం "కార్డుప్రాజెక్టు" ను అమలుచేస్తోంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ సేవలకు చెందిన వివరాలు, దస్తావేజులు,రహస్యంగా, సమగ్రంగా, నాణ్యంగా అవసరమైన సమయంలో అందుభాటులో ఉండే వీలుంది. ఈ శాఖలో రిజిస్ట్రేషన్ కు అదనంగా 1 శాతం ముడుపుల రూపంగా వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దీన్ని అడ్డుకోవటానికి ఆ శాఖ వసూలు చేసే పీజులు,సిటిజణ్ చార్టర్ తో పాటు ఆశాఖ నిఘా విభాగం గురించిన సమాచారం తెలిసుండాలి. రిజిస్త్రేషన్ శాఖ కార్యాలయాల్లోకి బ్రోకర్లు, మద్య దళారులు రాకుండా ప్రభుత్వం నిషేదించింది. క్రయ,విక్రయదారులు నేరుగా ఈ కార్యాలయాల్లో నున్న "సహాయ సలహా కేంద్రాలు" ను సంప్ర దించాలి. ముందుగా బేసిక్ రిజిస్టర్ లో ఆ ప్రాంత మార్కెట్ విలువలు తెలుసుకోవాలి. అక్కడే దస్తావేజుల నమూనాలు ఉచితంగా లబిస్తాయి. -----------దస్తావేజు వివరములు----స్టాంపుడ్యూటీ పీజు 1) అగ్రిమెంట్ సేల్ కం జిపిఎ-స్టాంపుడ్యూటీ 1 శాతం,మరియు పేజు -2000. 2) భాగపంపిణి దస్తావేజు-1 శాతం,రూ:-1000. 3) రిలీజ్ దస్తావేజు-1శాతం, రూ: 1000. 4) క్రయ దస్తావేజు-9 శాతం, రూ: (0.5శాతం). 5) దానదస్తావేజు-10 శాతం,రూ: 1000. 6) సెటిల్ మెంట్ దస్తావేజు ఎ) కుటుంబసబ్యులకు-1శాతం, రూ: 1000,బి) ఇతరులకు-6 శాతం ,రూ:1000. 7) అస్వాధీన తనఖా దస్తావేజు-3 శాతం ,రూ: (0.5శాతం).8) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ-1శాతం, రూ: 1000. 9)దత్తత--35శాతం, రూ: 100. 10)కుటుంబసబ్యులకు జిపిఎ-డ్యూటీ-1000, రూ:1000. *రిజిస్త్రేషన్ రుసుము రూ:1000 చొప్పున చెల్లించాలి.ఇంతకుమించి ఎక్కువ ఇవ్వవద్దు. మార్కెట్ విలువలు ఎక్కువ,తక్కువ చేసే ప్రయత్నం చేయవద్దు. సిటిజన్ చార్టర్:- ఎ)డాక్యు మెంట్ రిజిస్త్రేషన్--ఒక గంట. బి)ఇసి జారీ చేయుట--10 నిమిషాలు.సి) సిసి జారీ--10 నిమిషాలు.డి) నగదు రశీదు--5 నిమిషాలు.ఇ)మార్కెట్ విలువల నిర్దారణ--10 నిమిషాలు.జి) డాక్యుమెంట్ రాయటం-- పావుగంట. నిఘావిభాగం:- 1)ఎం.ఉదయ భాస్కర్ రావు , నిఘా అదికారి 1-7-10,ఎన్ బి కె ఎస్టేట్ , గోల్కొండ ఎక్స్ రోడ్- హైదరాబాద్ మొబైల్: 9440794855
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
