అట్రాసిటిస్ యాక్ట్-1989 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అట్రాసిటిస్ యాక్ట్-1989 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20 నవం, 2008

అట్రాసిటి చట్టం తో మేలు కంటే కీడే ఎక్కువ

షెడ్యూల్ కులాలు,తెగల ప్రజలు సమాజం లో గౌరవంగా బతక టానికి,అగ్రవర్ణాలు, ఇతరులనుంచి అవమానాలు ఎదురుకాకుండా చూడటానికి తీసుకు వచ్చిన చట్టమే ప్రివెన్షన్ ఆప్ అట్రాసిటిస్ యాక్ట్-1989.ఈ చట్టం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరటం పక్కనబెడితే , విచ్చల విడిగా దుర్వినియోగం అవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది.1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారత రాజ్యాంగం లో పొందుపర్చిన 366 అధికరణంలోని 24,25 క్లాజుల ఆధారంగా 11 సెప్టెంబర్ 1989 న ఈ చట్టం రూపొందింది. ఈచట్టంలోని సెక్షన్-3 ప్రకారం షెడ్యూల్ కులాలు,తెగల వారిని దూషించటం,సంఘ బహిష్కరణ ,లైంగిక వేదింపులు, చిన్నచూపు చూడటం,దాడులకు పాల్పడటం మొదలగు 14 రకాల నేరాలు ఈ చట్టం క్రిందకు వస్తాయి. నాన్ బెయిలబుల్ కేసు నమోదు తో పాటు ,నేరం రుజువైతే 6నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విదించే వీలుంది. రాజకీయ కారణాలతో గత పదేళ్ళుగా అకారణంగా ప్రత్యర్దులపై ఈ చట్టం క్రింధ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు అత్యదికం. పనిచేసి పెట్టడం లేదనే సాకుతో ప్రబుత్వోద్యోగులపై, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని జర్ణలిస్టులపై ఇటీవలి కాలంలో ఈ చట్టం కింద ఎక్కువగా కేసులు పెడుతున్నారు. ముందుగా బెయిల్ (యాంటీసీపేటర్) దొరికే పరిస్తితి లేకపోవటం వల్ల నిందితులకు రాజీ తప్ప మరో మార్గం లేదు. ఈ చట్టం వల్ల ఎంతో మంది ప్రబుత్వోద్యోగులు అరెస్టయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టం పేరు చెబితేనే జర్ణలిస్టులు, వ్యాపారులు హడలి పోతున్నారు. పరి శోదనాత్మక వార్తలు రాసే పరిస్తితి లేక పోవటంతో గిరిజనాబివృద్ది దెబ్బతింది. అప్పు తీసుకుని అడిగితే కులం పేరుతో తిట్టాడని కెసులు పెడుతుండతంతో వ్యాపారులు వీరికి అప్పు ఇవ్వటమే మానివేశారు. కొద్ది మంది చేష్టలవల్ల మొత్తం జాతి ఇబ్బందుల పాలయ్యే పరిస్తితి.బ్లాక్ మెయిల్ కోరకు పెట్టిన ఈ కేసులన్నీ న్యాయస్తానాల్లొ నిలబడలేకపోతున్నాయి.శిక్షకు ముందే నిందితుదు రిమాండ్ ఖైదీగా నెలరోజులపాటు జైల్లో ఉండే పరిస్తితి. వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు..ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయ సూత్రం.ఏ నేరం చేయని వ్యక్తిని , సంఘంలో పేరు ప్రఖ్యాతులున్నవారిని ఒక వ్యక్తి ఇచ్చిన పిర్యాదుతో జైల్లో తోస్తే ఆ తర్వాత సమాజంపై అతని ముద్ర నెగిటివ్ దోరణిలో ఉండదా? 20 యేళ్ళ క్రితం పరిస్తితులు నేడు లేవు. అంటరానితనం తగ్గింది.ఎస్సీ,ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. అలాంటప్పుదు చట్టాన్ని మార్పు చేయకుండా యదాతధంగా అమలు చేయటం ఓట్ల రాజకీయమే.అట్రాసిటి చట్టం కింద నమోదైన కేసులలో పోలీసుల విచారణ సరిగా ఉండటం లేదనే ఆరోపణ లున్నాయి. డీఎస్పీ స్తాయి అధికారి ఈ కేసులను విచారణ చేయాల్సి ఉంటుంది.పిర్యాదు లో ఇచ్చిన సాక్షులను విచారించి చేతులు దులుపు కుంటున్నారు.చాలావరకు బోగస్ కేసులే .తనపై కేసు నమోదు అయ్యిందని పోలీసులు చెప్పేవరకు నిందితుడికి తెలియదు.సంఘటన ఎప్పుడు,ఎక్కడ జరిగిందో కేసు ఎవరు పెట్టారోతెలియని బోగస్ కేసులే అధికం. నలుగురు సాక్షులుంటే చాలు ఏ స్తాయి వారి మీదనైన కేసు పెట్టవచ్చు.హత్య కేసులో కూడా అడ్వాన్సుగా బెయిల్ పొంది సమాజంలో గౌరవంగా తిరుగుతుంటే ,ఎస్సీ,ఎస్టి యాక్టు కేసుల్లో జైలు గదప తొక్కనిదే బయటపడలేని పరిస్తితి. వ్యక్తి స్వేచ్చకు,పత్రికా స్వేచ్చకు,సమాజంలో జీవించే స్వేచ్చకు ఇబ్బందికరంగా తయారైన ఈ చట్టాన్ని సవరించి మార్పులు తీసుకురావాలి.