16 ఆగ, 2008
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అడ్డుకోవటమెలా?
రిజిస్ట్రేషన్ శాఖ సమర్దవంతంగా పనిచేయటానికి 1999 నుంచి ప్రభుత్వం "కార్డుప్రాజెక్టు" ను అమలుచేస్తోంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ సేవలకు చెందిన వివరాలు, దస్తావేజులు,రహస్యంగా, సమగ్రంగా, నాణ్యంగా అవసరమైన సమయంలో అందుభాటులో ఉండే వీలుంది. ఈ శాఖలో రిజిస్ట్రేషన్ కు అదనంగా 1 శాతం ముడుపుల రూపంగా వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దీన్ని అడ్డుకోవటానికి ఆ శాఖ వసూలు చేసే పీజులు,సిటిజణ్ చార్టర్ తో పాటు ఆశాఖ నిఘా విభాగం గురించిన సమాచారం తెలిసుండాలి. రిజిస్త్రేషన్ శాఖ కార్యాలయాల్లోకి బ్రోకర్లు, మద్య దళారులు రాకుండా ప్రభుత్వం నిషేదించింది. క్రయ,విక్రయదారులు నేరుగా ఈ కార్యాలయాల్లో నున్న "సహాయ సలహా కేంద్రాలు" ను సంప్ర దించాలి. ముందుగా బేసిక్ రిజిస్టర్ లో ఆ ప్రాంత మార్కెట్ విలువలు తెలుసుకోవాలి. అక్కడే దస్తావేజుల నమూనాలు ఉచితంగా లబిస్తాయి. -----------దస్తావేజు వివరములు----స్టాంపుడ్యూటీ పీజు 1) అగ్రిమెంట్ సేల్ కం జిపిఎ-స్టాంపుడ్యూటీ 1 శాతం,మరియు పేజు -2000. 2) భాగపంపిణి దస్తావేజు-1 శాతం,రూ:-1000. 3) రిలీజ్ దస్తావేజు-1శాతం, రూ: 1000. 4) క్రయ దస్తావేజు-9 శాతం, రూ: (0.5శాతం). 5) దానదస్తావేజు-10 శాతం,రూ: 1000. 6) సెటిల్ మెంట్ దస్తావేజు ఎ) కుటుంబసబ్యులకు-1శాతం, రూ: 1000,బి) ఇతరులకు-6 శాతం ,రూ:1000. 7) అస్వాధీన తనఖా దస్తావేజు-3 శాతం ,రూ: (0.5శాతం).8) జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ-1శాతం, రూ: 1000. 9)దత్తత--35శాతం, రూ: 100. 10)కుటుంబసబ్యులకు జిపిఎ-డ్యూటీ-1000, రూ:1000. *రిజిస్త్రేషన్ రుసుము రూ:1000 చొప్పున చెల్లించాలి.ఇంతకుమించి ఎక్కువ ఇవ్వవద్దు. మార్కెట్ విలువలు ఎక్కువ,తక్కువ చేసే ప్రయత్నం చేయవద్దు. సిటిజన్ చార్టర్:- ఎ)డాక్యు మెంట్ రిజిస్త్రేషన్--ఒక గంట. బి)ఇసి జారీ చేయుట--10 నిమిషాలు.సి) సిసి జారీ--10 నిమిషాలు.డి) నగదు రశీదు--5 నిమిషాలు.ఇ)మార్కెట్ విలువల నిర్దారణ--10 నిమిషాలు.జి) డాక్యుమెంట్ రాయటం-- పావుగంట. నిఘావిభాగం:- 1)ఎం.ఉదయ భాస్కర్ రావు , నిఘా అదికారి 1-7-10,ఎన్ బి కె ఎస్టేట్ , గోల్కొండ ఎక్స్ రోడ్- హైదరాబాద్ మొబైల్: 9440794855
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి